రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మంటలు ఎగసి పడుతున్న దృశ్యా ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. ఈమేరకు ఆమె సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. వెంటనే మంటలకు అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఈ ఘటన మరో బ్లో అవుట్ కి దారి తీస్తుందని ఆ ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని తక్షణం చుట్టుపక్కల గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. కోనసీమ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మంటలు అదుపులోకి తీసుకొచ్చే వరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కోనసీమ ప్రాంతంలో ఈ మధ్య వరుస గ్యాస్ లీకేజీ ఘటనలపై విచారణ జరిపించాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు. భయం గుప్పిట్లో బ్రతుకుతున్న గ్యాస్ పైప్ లైన్ పరివాహక ప్రాంతాల ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని షర్మిల తన పోస్ట్ లో పేర్కొన్నారు.