తెలంగాణ‌ నిరుద్యోగులకు శుభవార్త …త్వరలోనే నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీ..!

Spread the love

తెలంగాణలోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.కాగా నిమ్స్ ఆసుపత్రిపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించేందుకు అదనంగా 125 వెంటిలేటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఖాళీగా ఉన్న 850 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 1,790 వెంటిలేటర్ బెడ్లకు తోడు మరో 490 కొత్త వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నట్లు వాటిని గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం మరియు జిల్లా ఆసుపత్రులకు కేటాయిస్తామని వెల్లడించారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం 9 కొత్త ఎంఆర్‌ఐ (MRI) యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి తెలిపారు.అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్ రెస్పాన్స్ సమయాన్ని 13 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గించేలా కొత్తగా 79 అంబులెన్స్‌లను ప్రవేశపెడుతున్నామని, డయాలసిస్ రోగుల కోసం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.