టారిఫ్‌ ల ద్వారా 600 బిలియన్ డాలర్ల ఆదాయం..మరోసారి సమర్ధించుకున్న ట్రంప్

Spread the love

2025లో రెండో సారి పదవిలోకి వచ్చినప్పటి నుండి పలు దేశాలపై టారిఫ్ లతో విరుచుకుపడిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ త‌న‌ టారిఫ్‌ల (సుంకాలు) విధానాన్నిమరోసారి బలంగా సమర్థించుకున్నారు. టారిఫ్‌ల ద్వారా తమ దేశానికి 600 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం సమకూరిందని, త్వరలోనే మరిన్ని నిధులు రానున్నాయని తెలిపారు. ఈ విధానం వల్ల దేశం ఆర్థికంగానే కాకుండా, నేషనల్ సెక్యూరిటీ  పరంగా కూడా ఎంతో బలపడిందని అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. టారిఫ్‌ ల తో మాకు 600 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. కానీ, ఫేక్ న్యూస్ మీడియా ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదు. సుప్రీంకోర్టులో టారిఫ్‌లపై రాబోయే కీలక తీర్పును ప్రభావితం చేయడానికే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. టారిఫ్‌ ల వల్లే అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందని అన్నారు.  2అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్, విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇక భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై కూడా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.