కాంగ్రెస్ అగ్రనేత, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ లో చేరారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో సోనియా గాంధీ దగ్గుతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సాధారణ చెకప్ లో భాగంగానే ఆమె హాస్పిటల్ లో చేరినట్లు స్పష్టం చేశాయి. సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ట్రీట్మెంట్ కొనసాగుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. గత డిసెంబర్ లో సోనియా 79వ పుట్టినరోజును జరుపుకున్నారు. మరోవైపు, సోనియా హాస్పిటల్ లో చేరారన్న వార్తతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు, సోనియా ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.