‘మన శంకర వరప్రసాద్ గారు’ సెన్సార్ పూర్తి..రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్  

Spread the love

మెగాస్టార్ చిరంజీవిప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎలాంటి కోతలు లేకుండా క్లీన్ యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నెల‌ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. మళ్లీ వింటేజ్ మెగాస్టార్ ను అనిల్ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. దీంతో ఈ మూవీ పై ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రానుండడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక ఈ మూవీలో  విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనుండడం మరో అదనపు ఆకర్షణ. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ  సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్ కొట్టేందుకు వచ్చేస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో రేపు జరగనుంది.