మాజీ కేంద్రమంత్రి సురేష్ కల్మాడీ ఇక లేరు. ఆయన వయసు 81 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1964 నుంచి 1972 వరకు ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పనిచేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అనేక కీలక పదవులు చేపట్టారు. 1944 మే1న తమిళనాడులోని మద్రాసులో కల్మాడి జన్మించారు. మహారాష్ట్ర పుణేలోని సెయింట్ విన్సెంట్లో హైస్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫెర్గూసన్ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో (NDA) సైనిక శిక్షణ తీసుకొన్న ఆయన.1965, 1971 ఇండో-పాక్ యుద్ధాల్లో కూడా పాల్గొన్నారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రైల్వేశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగానూ ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వాహక కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. జోథ్ పూర్ ర్, అలహాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ కాలేజీలో పైలట్గా శిక్షణ పొందారు. 1982లో అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చారు. శరద్ పవార్ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఎస్) మద్దతుతో మహారాష్ట్ర నుంచి స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.