టీ20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీవచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు వరుసగా తమ తమ జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ కూడా ఈ మెగా టోర్నీ కోసం టీమ్ ను ప్రకటించింది. మిచెల్ శాంట్నర్ సారథ్యంలో న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ‘ఎక్స్’ వేదికగా నేడు పోస్ట్ చేసింది. ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. ఇక ఈనెల 11 నుంచి న్యూజిలాండ్ జట్టు భారత్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజిలో న్యూజిలాండ్ ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్థాన్ లో, ఫిబ్రవరి 10న అదే వేదికగా యూఏఈతో, ఫిబ్రవరి 14న అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో, ఫిబ్రవరి 17న చెన్నై వేదికగా కెనడాతో తలపడనుంది.
న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), డెవన్ కాన్వే, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), మిచెల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, లూకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారెల్ మిచెల్, ఆడమ్ మిలైన్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, ఇష్ సోథీ.