డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో నిన్న చోటు చేసుకున్న బ్లోఅవుట్ ఘటనలో ఇంకా కూడా మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. గూడవల్లి పంట కాలువ నుంచి పైపుల ద్వారా నీటిని మళ్లించి మంటలను అదుపు చేస్తున్నారు. రాజమహేంద్రవరం, నర్సాపురం ఓఎన్జీసీ టీమ్స్ బావిలో నుంచి ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే తీవ్రత కొంచెం తగ్గిందని, ఘటనా స్థలిలో ఫైర్ ఫైటింగ్ చేస్తున్నామని ఓఎన్జీసీ అధికారులు వివరించారు. మరో వైపు ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ బ్లో అవుట్ ప్రదేశానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది . పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక.. ఘటన ఎలా జరిగింది? ఇతరత్రా వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.