‘సమంత ఈజ్ బ్యాక్’.. ‘మా ఇంటి బంగారం’ మూవీతో  వస్తోన్న స్టార్ హీరోయిన్

Spread the love

ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించిన స్టార్ హీరోయిన్ సమంత. తన అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను పంచుకున్నారు. ఈ సంక్రాంతికి టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ను షేర్ చేసుకున్నారు. “మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది” అనే క్యాప్షన్ ను జోడించారు. జనవరి 9న ఈ మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ  ‘సమంత  ఈజ్ బ్యాక్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

‘ఓ బేబీ’ తర్వాత సమంత దర్శకురాలు నందిని రెడ్డికాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ గతేడాది అక్టోబర్ 2న దీని చిత్రీకరణ ప్రారంభమైంది. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మిస్తున్న రెండో చిత్రమిది. దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలు. ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక దీంతో పాటు సమంత ‘రక్త్ బ్రహ్మాండ’ చిత్రంలో కూడా నటిస్తున్నారు.