సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో ఏపీ మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ యాక్ట్ 2000 – సేఫ్ హార్బర్, బ్లాకింగ్ పవర్స్, ఐటీ రూల్స్ 2021-కంప్లయన్స్ అండ్ ట్రేసబిలిటీ, డిపీడీపీ యాక్ట్- 2023 డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్, జ్యుడీషియల్ సేఫ్ గార్డ్స్- ఫ్రెష్ స్పీచ్ & ప్రైవసీ వంటి అంశాలపై చర్చించారు. సోషల్ మీడియాలో కుట్ర పూరిత, విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని, మహిళలపై అవమానకర, అసభ్య పోస్టులు పెట్టే వారిపై నిఘా పెట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తామని ఉద్దేశపూర్వకవిద్వేష వ్యాఖ్యలను సహించమని లోకేష్ స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ అసభ్య కంటెంట్‌ను అరికట్టాలి. మహిళలపైఅవమానకర, అసభ్య పోస్టులు పెట్టే వారిపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ప్రజాభీష్టాన్ని అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో దురుద్దేశపూర్వక పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ధర్నాచౌక్ లాంటి ప్రదేశాల్లో నిరసన తెలియజేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందని గతంలో జ్యుడీషియరీతో పాటు కొంతమందిని టార్గెట్ గా చేసుకుని అసభ్య పోస్టులు పెట్టారు. విదేశాల్లో ఉంటూ అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం బలమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలు,దేశాల్లో అమలు చేస్తున్న చట్టాలపై అధ్యయనం చేయాలని మాజీ ముఖ్యమంత్రి భార్యపై పోస్టు పెడితే మా పార్టీ వాడైనా జైలుకు పంపించామని ఈ సందర్భంగా లోకేష్ గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి రాష్ట్రస్థాయి సమన్వయ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.