అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆయన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ నుంచి ఓ ఆసక్తికరమైన వీడియో విడుదలైంది. ఈ వీడియోతో అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ థీమ్‌తో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ తొలి చిత్రాలైన ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘జానీ’ వంటి సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. చాలా సందర్భాల్లో ఆయన తన ఫైట్ సీన్లను స్వయంగా కంపోజ్ చేసుకున్నారు. కొత్తవారిని ప్రోత్సహించేందుకు స్థాపించిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి చాలా కాలం తర్వాత ప్రకటన రావడంతో ఇది సినిమానా లేక మరేదైనా ప్రాజెక్టా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై త్వరలోనే అధికారికంగా దీనిపై ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.