రెండో విడత భూ సేకరణ.. రైతులకు రుణమాఫీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ 

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తీసుకున్న భూమిని త్వరితగతిన డెవలప్ చేసి ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. మూడు సంవత్సరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, క్రీడా ప్రాంగణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలిపారు. తుళ్లూరు మండలం వడ్డమానులో రెండో విడత భూ సమీకరణ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కోరారని దీనిపై సీఎం చంద్రబాబుకు తెలుపగా ఆయన అంగీకరించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈనెల 6వ తేదీ వరకు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు. రూ. 1.50 లక్షల వరకు దీనిని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఇక రైతుల కౌలు పెంచేందుకు కూడా సీఎం ప్రాథమికంగా ఒప్పుకున్నట్లు తెలిపారు. రాజధానికి అన్యాయం చేయాలని చూసిన జగన్ కు ప్రజలు బుద్దిచెప్పారని తెలిపారు. రాజధాని కోసం కేంద్రాన్ని ఒప్పించి సీఎం చంద్రబాబు నిధులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు.