అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనేదే కూటమి ప్రభుత్వ విధానం:మంత్రి లోకేష్

Spread the love

పెట్టుబడుల విషయంలో దేశంలోనే టాప్ లో ఉన్నామని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతికి చట్టబద్దత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధానిని తరలించలేకపోయిందని అన్నారు. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. అమరావతికి మంచి విమానాశ్రయం కావాలి.. అందుకే భూసేకరణ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.  ప్రాజెక్టుల పూర్తికి సమయం పడుతుందని  శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు.  ఎకరం 99 పైసలకే ఇస్తున్నారంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి.. మన యువతకు ఉద్యోగాలు రావాలని పునరుద్ఘాటించారు.  ఆర్థిక రాజధాని విశాఖేనని అందుకే ఇక్కడకి పెట్టబడులు వస్తున్నాయన్నారు.  విశాఖకు ఐటీ, ఫార్మా, డేటా సెంటర్, స్టీల్ సిటీలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనేదే కూటమి ప్రభుత్వ విధానమన్నారు. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని  చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టమని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై  ఉందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.