ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా 4-1తో గెలుచుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. రెండో ఇన్నింగ్స్ లో 302/8 తో ఐదో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ 342 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు ఇచ్చిన 160 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ట్రావిస్ హెడ్ (29), జాక్ వెదర్లాండ్ (34), మార్నస్ లబుషేన్ (37) పరుగులు చేశారు. స్టీవ్ స్మిత్ (12), ఉస్మాన్ ఖవాజా (6) విఫలమయ్యారు. అలెక్స్ కేరీ (16*), కామెరూన్ గ్రీన్ (22*) నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ (3/42) మెరిశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 384, ఆస్ట్రేలియా 567 పరుగులకు ఆలౌటయ్యాయి. 4 మ్యాచ్ లు ఆడి 26 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ తో ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. సిడ్నీ టెస్టు తర్వాత తాను రిటైరవనున్నట్లు ఇదివరకే ఖవాజా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇరు జట్ల స్కోర్లు:
ఇంగ్లాండ్:384&342
ఆస్ట్రేలియా:567&161-5.