అదేం డ్యాన్స్ బాసూ… మెగాస్టార్ చిరు ‘హుక్ స్టెప్’ కు ఫిదా అవుతున్న ప్రేక్షకులు

Spread the love

ఈ  సంక్రాంతి చిత్రాల రేసులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌ల కాంబోలో  వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘అల్టిమేట్ మెగా స్వాగ్’ హుక్ స్టెప్ సాంగ్ ఈ హైప్‌ ను శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లింది.  ఈ పాటలో మెగాస్టార్ తనదైన స్టైల్, స్వాగ్‌తో చేసిన డ్యాన్స్ మూమెంట్స్ సాధారణ ప్రేక్షకుల్నే కాకుండా ఎందరో సెలబ్రెటీస్ ను సైతం మంత్రముగ్దులను చేశారు. నాని, అడివి శేష్ వంటి హీరోలు కూడా బాస్ స్టెప్స్ పై సూపర్ అంటూ స్పందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పాటలో చిరంజీవి స్టైలిష్ లుక్, ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్‌తో కనిపించారు. ఆ ఏజ్ లో ఆ డ్యాన్స్ ఏంటి బాబోయ్ అంటూ  ఆయన ప్రదర్శించిన ఎనర్జీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ కూడా మెగాస్టార్ తో కలసి స్క్రీన్ మీద  కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. నయనతార, కేథరిన్ ట్రెసా కథానాయికలుగా నటించారు. భీమ్స్ సంగీతం సమకూర్చారు.