ప్రపంచ పర్యాటకుడిగా పేరు పొందిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్, అనేక దేశాలు తిరిగి యూట్యూబ్ లో భారీ ఫాలోవర్స్ సంపాదించాడు. అయితే ఇటీవల అతని వెకిలి చేష్టలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ముఖ్యంగా హిందూ దేవతలు, మహిళల పట్ల అసభ్యకర మాటలు అతడిని వివాదాస్పదంగా మార్చాయి. నెటిజన్లు, సినీ ప్రముఖులు అతని తీరుపై మండిపడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన లిడియా లక్ష్మి అనే మహిళ కూడా అన్వేష్ పై ఫైర్ అయ్యారు.
హిందూ దేవతలపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మంపై మక్కువతో హిందూ మతాన్ని స్వీకరించిన ఆమె, ప్రస్తుతం థాయ్‌లాండ్ లోని ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తున్నారు. థాయ్‌లాండ్ లో అన్వేష్ ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసని, అనుమతిస్తే అతడిని భారత్‌కు పట్టుకొస్తానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని, అన్వేష్ పతనం మొదలైందని ఆమె మండిపడ్డారు.