ఏపీ మంత్రులతో టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేష్ అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మాదిరిగా ‘రప్పా రప్పా’ మన విధానం కాదు.. దౌర్జన్యాలు, బెదిరించడం తెలుగుదేశం సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ ఎంత సేవ చేశామన్నదే మన అజెండా కావాలని పేర్కొన్నారు. అభివృద్ధి-సంక్షేమం సమన్వయంతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ కుట్రలను పార్లమెంటు వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. నేతలు ఏకతాటిపైకి వచ్చి వైసీపీ అసత్య ప్రచారాలకు గట్టిగా సమాధానమివ్వాలన్నారు. ప్రజావేదికలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మంత్రులు బాధ్యత తీసుకోవాలని తమ శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి మంత్రులు చొరవ చూపాలని చెప్పారు. పార్టీ బలోపేతానికి క్యాడర్‍ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్‌ఛార్జి మంత్రులు పనిచేయాలని మంత్రి లోకేష్ వారికి సూచించారు.