వీధి కుక్కల అంశంపై సుప్రీం కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు

Spread the love

వీధి కుక్కల అంశంపై సుప్రీం కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వీధిలో ఉన్న ప్రతి కుక్కను తరలించాలని తాము చెప్పలేదని గతంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు నేడు స్పందించింది. కేవలం సంస్థలు, కార్యాలయాల దగ్గరి నుంచి మాత్రమే వాటిని తరలించమన్నట్లు స్పష్టం చేసింది. వీధి కుక్కల అంశంపై ఈరోజు  కూడా విచారణ జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. జంతువుల జనన నియంత్రణకు సంబంధించిన నిబంధనలపై ప్రధానంగా దృష్టి సారించాలని  దేశ అత్యున్నత న్యాయస్థాన  ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సెన్సిటివ్ ప్రదేశాలలో సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తంచేసిన కోర్టు హాస్పిటల్ వార్డుల్లో, పేషంట్ ల  చుట్టూ కుక్కలు సంచరించడానికి అనుమతించాలా అని ప్రశ్నించింది. దేశంలో కుక్క కాటు సంఘటనలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజల సెక్యూరిటీ , హెల్త్  తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బస్, రైల్వేస్టేషన్లు, క్రీడా ప్రాంగణాలు,హాస్పిటల్స్  తదితర జన సంచార బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఆయా సంస్థల ప్రాంగణాల్లోకి అవి చొరబడకుండా ఫెన్సింగ్ లు నిర్మించాలని తెలిపింది.