లాజిస్టిక్స్ వినియోగంలో వరల్డ్ లెవెల్ లో  పోటీ పడాలి:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

ఏపీ సీఎం  చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలను మంత్రివర్గం చర్చించింది. సమావేశంలో అజెండా అంశాలు తాజా రాజకీయ  పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. లాజిస్టిక్స్ వినియోగంలో వరల్డ్ లెవెల్ లో  పోటీ పడాలన్నారు. జల రవాణా పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు తెలిపారు. అన్ని తీర ప్రాంత జిల్లాలో ఒక్కో పోర్టు ఏర్పాటు కావాలన్నారు. ఇక వైసీపీ పాలనలో విధించిన ట్రూఅప్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. రూ.4,490 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తోందని యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.5.19 నుంచి రూ.4.90కి తగ్గించినట్లు పేర్కొన్నారు. చీరాలలో టూరిజాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. సూర్యలంకలో కొత్తగా 3 హోటళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. టూరిజం ఒక గేమ్ ఛేంజర్ గా అభివర్ణించారు. టూరిజంలో  అన్ని అవకా శాలను అందిపుచ్చుకోవాలన్నారు. బార్లకు, లిక్కర్ షాపులకు తేడా లేకుండా ఏఈఆర్టీ ఛార్జీలు సమం చేయాలని చంద్రబాబు అన్నారు. సముద్రంలో కలిసే జలాలు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోవడంపైన స్పందిస్తూ నీళ్లు ఊరికే సముద్రం పాలైతే ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు.