మాజీ సీఎం కె.సి.ఆర్ ను కలిసిన మహిళా మంత్రులు.. మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందజేత 

Spread the love

తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఈరోజు కేసీఆర్ ను  మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను బీ.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించి  అతిథి మర్యాదలతో సాగనంపారు. మేడారం ప్రసాదం అందజేసి.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న జాతరను సందర్శించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మహిళా మంత్రులు కె.సి.ఆర్ కు ఆహ్వానం పలికారు. కేసీఆర్ దంపతులు ఇచ్చిన తేనీటి విందు స్వీకరించారు.  యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆహ్వానించారు.