భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పై యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి అదిరే విజయాన్ని అందుకున్నాడు. తాజాగా జరుగుతున్న టాటా స్టీల్ చెస్ టోర్నీలో ర్యాపిడ్ విభాగం నాలుగో రౌండ్లో అర్జున్ 58 ఎత్తుల్లో ఆనంద్ ను ఓడించాడు. అయిదో రౌండ్లో వీ యీపై నెగ్గిన అతడు.. తర్వాత అరవింద్ చిదంబరంతో డ్రా చేసుకున్నాడు. మొత్తం 3.5 పాయింట్లతో అర్జున్ 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు అర్జున్ చేతిలో పరాజయం చవిచూసినా నీమన్, మార్జిన్ లపై గెలిచిన ఆనంద్ 4.5 పాయింట్లతో నిహాల్ సరీన్ కలిసి ఉమ్మడిగా నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. మహిళల విభాగంలో 3 పాయింట్లతో వంతిక అగర్వాల్ నాలుగో స్థానంలో.. రక్షిత (2.5), దివ్య దేశముఖ్ (2) 9, 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు.