తిలక్ వర్మకు సర్జరీ.. న్యూజిలాండ్ తో మొదటి మూడు మ్యాచ్ లకు దూరం 

Spread the love

టీ20 ప్రపంచకప్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి ముందు న్యూజిలాండ్ టీ20 సిరీస్ కు రెడీ అవుతున్న భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సర్జరీ చేయించుకున్న కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఆ సిరీస్ తొలి మూడు మ్యాచ్ లకు  దూరమయ్యాడు. కోలుకోవడాన్ని బట్టి  అతడు మిగతా రెండు మ్యాచ్ల్లో ఆడడం ఆధారపడి ఉంది.

ఇక ఫిబ్రవరి 7న జరిగే ప్రపంచకప్ ఆరంభం కానున్న నేపథ్యంలో తిలక్ పరిస్థితి భారత అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.  ఇక సర్జరీ అనంతరం ఇప్పుడు అతడు బాగానే ఉన్నాడని  గురువారం డిశ్చార్జయ్యాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్ తొలి మూడు టీ20లకు అతడు దూరమైనట్లు పేర్కొంది. కివీస్ తో సిరీస్ ఈ నెల 21న మొదలవుతుంది. ఆఖరి రెండు మ్యాచ్ లు  28, 31వ తేదీల్లో జరుగుతాయి. తిలక్ స్థానంలో మరో ఆటగాణ్ని సెలక్టర్లు ఇంకా ఎంపిక చేయలేదు. శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్ రేసులో ఉన్నారు.