‘మా ఇంటి బంగారం’ టీజర్ విడుదల.. యాక్షన్ తో అదరగొట్టిన సమంత

Spread the love

అగ్రకథానాయిక సమంత  అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా టీజర్ ను రూపొందించారు. హోమ్లీగా కనిపిస్తూనే సమంత యాక్షన్ ఎపిసోడ్స్ తో దుమ్ముదులిపేశారు. సీనియర్ నటులు గౌతమి, శ్రీలక్ష్మీతో పాటు శ్రీ ముఖి తదితరులు టీజర్ లో కనిపించారు. ఇక టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ  ‘సమంత  ఈజ్ బ్యాక్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఓ బేబీ’ తర్వాత సమంత దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ . ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై వస్తోంది. దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలు. ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక దీంతో పాటు సమంత ‘రక్త్ బ్రహ్మాండ’ చిత్రంలో కూడా నటిస్తున్నారు.