ఈ సంవత్సరం ఆస్కార్ రేసులో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన రెండు సినిమాలు పోటీపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల రేసులో ‘కాంతారా చాప్టర్-1’, ‘మహావతార్ నరసింహ’ చిత్రాలు. ఆస్కార్ అవార్డ్స్ జనరల్ ఎంట్రీలో చోటు సంపాదించాయి. దీంతో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్ తో పాటు నిర్మాత, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి ఇతర కేటగిరీల్లో కూడా ఇవి పోటీపడబోతున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టింది. ఆస్కార్ కు రెండు అడుగుల దూరంలో ఉన్నామని తెలిపింది. ఇక 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది ఆస్కార్ కోసం పోటీపడనున్న చిత్రాల ఫైనల్ లిస్ట్ ను ఈనెల 22న ప్రకటించనున్నట్లు అకాడమీ తెలిపింది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ 98వ ఆస్కార్ వేడుక జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాలు ఇందులో పోటీ పడతాయి.