ఐఐటీ మద్రాస్ లో స్వదేశీ టెక్నాలజీ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్  ‘పరమ్ రుద్ర’

Spread the love

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ లో ‘పరమ్  రుద్ర’ అనే సూపర్ కంప్యూటర్ అందుబాటులోకి వచ్చింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ అవడం  విశేషం. సి-డాక్ రుద్ర సిరీస్ సర్వర్లతో దేశంలో తయారైన ఈ సిస్టమ్  ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ పై  నడుస్తుందని ఐఐటీ మద్రాస్ ఒక  ప్రకటనలో పేర్కొంది.  ఏరోస్పేస్, మెటీరియల్స్, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో వరల్డ్ లెవల్ లో  పోటీ పడేందుకు కూడా వీలుగా ఉండనుందని తెలిపింది.  కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ ఇటీవల ఈ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ ను  ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ‘పరమ్ శక్తి’ పేరిట ప్రారంభమైన అధునాతన వ్యవస్థను రీసెర్చర్స్ వినియోగించుకోవచ్చన్నారు. ఇక దీని ప్రారంభోత్సవంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ (exascale computing) దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచ స్థాయి కంప్యూటేషనల్ సామర్థ్యాలను నిర్మించడంలో ‘పరమ్ శక్తి ‘ ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది.