ఇది లీకేజీల సర్కార్ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు.. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ పరీక్ష పేపర్లు లీక్ అంటూ ఆరోపణాస్త్రాలు సంధించారు. స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు. వర్సిటీల భూములు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం తప్ప ఆయనకు విద్యార్థుల గోడు పట్టదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్య వ్యవస్థను గాడిలో పెట్టండి.. లేదంటే విద్యాశాఖను మరో మంత్రికి అప్పగించండని కవిత సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.