టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ టైటిల్ విజేతగా కోల్ కతా యువ గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్ నిలిచాడు. 9 రౌండ్ల నుంచి 6.5 పాయింట్లతో అతడు అగ్రస్థానం సాధించాడు. ఈ టైటిల్ విజయాన్ని తన తాతకు అంకితమిస్తున్నట్లు నిహాల్ తెలిపారు. ఆనంద్ (6) రెండో స్థానంలో నిలవగా.. అర్జున్ ఇరిగేశి 5 పాయింట్లతో మూడో స్థానం సాధించాడు. ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో 6వ స్థానంతో ముగించాడు. మహిళల విభాగంలో రష్యాకు చెందిన కేతరిన్ లాంగో (6.5) టైటిల్ విజేతగా నిలిచింది. మరో రష్యా అమ్మాయి. అలెగ్జాండ్రా గోర్యచ్కినా 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచకప్ ఛాంపియన్ దివ్య దేశముఖ్ (4.5) 3వ స్థానం సాధించింది. దివ్యతో సమాన స్కోరు చేసినా టైబ్రేక్ స్కోరులో వెనకబడిన హారిక (4.5) నాలుగో స్థానం, వైశాలి (4.5) 5వ స్థానంతో సరిపెట్టుకున్నారు.