విద్యార్థుల్లో విభిన్న ప్రతిభను వెలికితీస్తున్న మీ కృషి ప్రశంసనీయం మాస్టారు:మంత్రి లోకేష్ 

Spread the love

విద్యా శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ విద్యార్థుల కోసం అనేక కీలక సంస్కరణలు అమలు చేస్తున్నారు మంత్రి లోకేష్. అంతే కాకుండా విద్యార్థులకు విభిన్న పద్దతుల ద్వారా విద్యను అందించే టీచర్ల ఆయన తన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభినందనలు కూడా తెలుపుతుంటారు. ఈక్రమంలోనే తెనాలికి చెందిన డ్రాయింగ్ టీచర్, సాహితీవేత్త, ఎన్.సీ.సీ ఆఫీసర్,  ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రతిభతో అన్ని రంగాల్లో రాణిస్తూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్న బెల్లంకొండ వెంకటేశ్వరరావు మాస్టారికి అభినందనలు తెలిపారు. తెనాలి మారిస్ పేట NCRNM హైస్కూల్ డ్రాయింగ్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. పిల్లలతో నాటకాలు ప్రదర్శించడం, బొమ్మలు వేయడం, మంచి చేతిరాత నేర్పిస్తూ.. విద్యార్థుల్లో విభిన్న ప్రతిభను వెలికితీస్తున్న మీ కృషి ప్రశంసనీయం మాస్టారు అంటూ లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.