ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ తొలి మ్యాచ్ లో ఆర్.సీ.బీ విజయం సాధించింది. ఆఖరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్.సీ.బీ 3 వికెట్ల తేడాతో ముంబయిపై అదిరే విజయాన్ని అందుకుంది. నదైన్ (63 నాటౌట్; 44 బాల్స్ లో 7×4, 2×6) సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 20 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. ముంబయి బౌలర్లలో అమేలియా కెర్ (2/13), నికోలా కేరీ (2/35) రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో సజీవన్ సజన (45; 25 బంతుల్లో 7×4, 1×6), నికోలా కేరీ (40; 29 బాల్స్ లో 4×4) రాణించింది. దీంతో ముంబయి 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. నదైన్ (4/26) బౌలింగ్లోనూ అదరగొట్టింది. డబ్ల్యూపీఎల్లో ఆమెకిది రెండో మ్యాచ్ మాత్రమే కావడం గమనార్హం.
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: 154-6 (20).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 157-7 (20).