శ్రీతేజ్ కు అల్లుఅరవింద్2 కోట్లు భారీ విరాళం

allu arvind cheque to dil raju

పుష్ప 2’ ప్రీమియర్స్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. తన కుమారుడు శ్రీ తేజ్‌కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందనే విషయం తెలిసిందే. అందుకే అప్పటినుండి శ్రీ తేజ్.. కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. కొన్నాళ్ల పాటు వెంటిలేటర్ సాయంతో ఊపిరి పీల్చుకున్న శ్రీ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం కాస్త నిలకడగా ఉందని తనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు బులిటెన్‌ను అందించారు. తాజాగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఆసుపత్రికి వెళ్లి తనకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించారు.
శ్రీ తేజ్ కుటుంబానికి 2 కోట్ల విరాళం ఇస్తున్నట్టుగా ఆసుపత్రిలోనే అందరి ముందు ప్రకటించారు. కాగా అల్లు అరవింద్ అందించిన 2 కోట్లలో అల్లు అర్జున్‌కు సంబంధించింది 1 కోటి, మైత్రీ మూవీ మేకర్స్ తరపున 50 లక్షలు, సుకుమార్ తరపున 50 లక్షలు ఉన్నాయి. అంటే మొత్తం ‘పుష్ప 2’ మేకర్స్ అంతా కలిపి ఈ విరాళాన్ని శ్రీ తేజ్ కుటుంబానికి అందించినట్టుగా తెలుస్తోంది. అసలైతే అల్లు అరవింద్, సుకుమార్ కలిసే కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న శ్రీ తేజ్‌ను కలవాల్సింది. కానీ సుకుమార్ విదేశాల్లో ఉండడం వల్ల ఆసుపత్రికి రాలేకపోయారని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ‘పుష్ప 2’ టీమ్ అంతా కలిసి అందించిన విరాళాన్ని ప్రభుత్వ ప్రతినిధి ఎఫ్ డీ సీ చైర్మెన్ దిల్ రాజుకు అందించారు అల్లు అరవింద్.

Film producers Allu Arvind and Dil Raju visited Sri Tej at KIMS Hospital on Wednesday. Allu Arvind had handed over cheques of Rs 2 crore to Dil Raju. “On behalf of alluarjun, we are giving a compensation of Rs 1 crore tSri Tej, Rs 50 lakh each by director

SukumarWritings and MythriOfficial producers, ” Allu Arvind said, and added that the boy is recovering well. “Due to some legal issues I am unable to meet Sri Tej’s family,” the producer said.