విజయవాడలో ఘనంగా సెమీ క్రిస్మస్
అలరించిన వేడుకలు..
విజయవాడ చిట్టినగర్ టైలర్ పేటలోని వేళంగిణీ మాత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా క్రిస్మస్ కు ముందు 15 రోజుల పాటు వేళంగిణీ మాత యువజన సంఘం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆటలు, పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ వీటికి ముగింపుగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అలాగే ఆటలు, పాటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.