సంక్రాంతి పండుగ వేళ మెగాస్టార్ చిరంజీవి ‘శంకర వరప్రసాద్’ చిత్రంతో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నారు. ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రానికి మిశ్రమ స్పందన రావడంతో, అందరి దృష్టి మెగాస్టార్ మూవీ పైనే నెలకొంది. దానికి తగ్గట్టే దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ మరియు యాక్షన్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి, ఈలలు, గోలలతో పండుగ వాతావరణం నెలకొంది.అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో టాలీవుడ్ అభిమానులకు ఉన్న ప్రత్యేకత వేరే లెవల్. తమ అభిమాన నటులపై చూపించే ప్రేమ, మరే ఇండస్ట్రీ అభిమానుల్లోనూ అంతగా కనిపించదు. ముఖ్యంగా భారీ సినిమాలు విడుదలయ్యే సమయంలో థియేటర్ల లోపల, బయట జరిగే సంబరాలు అది ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అందులోనూ పండగ సీజన్ కావడంతో మరింత జోరు కనబడుతోంది. మన శంకర వర ప్రసాద్ సినిమాలో మన మెగాస్టార్ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఇక ఈ కథలో వెంకటేష్ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు.కలెక్షన్ల పరంగా చూస్తే, తొలిరోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల రూపాయల ఓపెనింగ్స్‌ను సాధించి బాక్సాఫీస్‌ను షాక్ చేస్తోంది. ఇది కేవలం ఉదయం షోల సమాచారం మాత్రమే కావడంతో, సాయంత్రం మరియు నైట్ షోల నాటికి వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి విన్నర్‌గా మెగాస్టార్ నిలిచారని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.