కరూర్ స్టాంపేడ్  ఘటన.. సీబీఐ ముందుకు టీవీకే అధినేత విజయ్ 

Spread the love

కరూర్ స్టాంపేడ్  ఘటన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత  విజయ్ (Vijay) నేడు సీబీఐ (CBI) విచారణకు హాజరయ్యారు. ఇందుకోసం ఉదయం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడికి సెక్యూరిటీ  కల్పించాలని ఢిల్లీ పోలీసులను టీవీకే కోరింది. గతేడాది సెప్టెంబరు 27న కరూర్ విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును ఇన్వెస్టిగేట్  చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని ఇన్వెస్టిగేటివ్ సంస్థ అధికారులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇటీవల విజయ్ కు సీబీఐ సమన్లు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముగ్గరు సభ్యుల కమిటీని సుప్రీం కోర్టు.నియమించింది.