కరూర్ స్టాంపేడ్ ఘటన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ (Vijay) నేడు సీబీఐ (CBI) విచారణకు హాజరయ్యారు. ఇందుకోసం ఉదయం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడికి సెక్యూరిటీ కల్పించాలని ఢిల్లీ పోలీసులను టీవీకే కోరింది. గతేడాది సెప్టెంబరు 27న కరూర్ విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని ఇన్వెస్టిగేటివ్ సంస్థ అధికారులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇటీవల విజయ్ కు సీబీఐ సమన్లు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముగ్గరు సభ్యుల కమిటీని సుప్రీం కోర్టు.నియమించింది.