మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్’ గా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. తన వింటేజ్ స్వాగ్తో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ఈ సునామీ నిజంగా అద్భుతం. మొదటి రోజే 84 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సత్తా చాటింది. కేవలం కలెక్షన్లే కాదు, బుక్ మై షోలో సెకండ్ డే కూడా లక్షలాది టిక్కెట్లు అమ్ముడవుతుండటం చూస్తుంటే, ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది.సినిమాలో ‘మీసాల పిల్ల’ అంటూ నయనతారతో చిరంజీవి చేసే అల్లరి, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులకు కన్నుల పండుగగా ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్‌లోని మాస్ యాంగిల్‌ను, కామెడీ టైమింగ్‌ను సరిగ్గా వాడుకున్నారు. ముఖ్యంగా ఆ హుక్ స్టెప్పులు సోషల్ మీడియాలో ఏ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం; థియేటర్లలో ఫ్యాన్స్ డాన్సులు వేయడం ఒక ఎత్తైతే, ఇంట్లో ఫోన్ పట్టుకుని కూడా స్టెప్పులు వేయించేలా ఆ పాటలు మ్యాజిక్ చేశాయి.కథ అందులో ఉన్న ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అదే ఈ సినిమాను క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది.
ఇక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ విక్టరీ వెంకటేష్ గారి స్పెషల్ రోల్. మెగాస్టార్, వెంకీ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఆ ఎనర్జీనే వేరు. వారిద్దరి మధ్య వచ్చే డైలాగ్స్, వెంకీ మార్క్ కామెడీ మరియు ఆ మెగా విక్టరీ మాస్ సాంగ్ థియేటర్లను హోరెత్తిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది. మొత్తానికి, ‘శంకర వర ప్రసాద్’ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలిచింది. వింటేజ్ చిరంజీవిని చూడాలనుకున్న అభిమానుల కోరికను అనిల్ రావిపూడి వంద శాతం నెరవేర్చారు. రెండో రోజు కూడా ఇదే జోరు కొనసాగితే, 100 కోట్ల మార్కును దాటి కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఈ సంక్రాంతికి మెగాస్టార్ నిజంగానే కుంభస్థలాన్ని కొట్టేసి, బాక్సాఫీస్ వద్ద తనపవర్ ను మరోసారి చాటారు.