టీ20 టీమ్ లోకి శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం 

Spread the love

శ్రేయాస్ అయ్యర్ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. న్యూజిలాండ్ తో  టీ20 సిరీస్ లో మొదటి  మూడు మ్యాచ్లకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. సర్జరీ కారణంగా దూరమైన తిలక్ వర్మ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ తో భర్తీ చేశారు. శ్రేయస్ చివరగా 2023 డిసెంబరులో ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్  ఆడాడు. మరోవైపు న్యూజిలాండ్ మొదటి  వన్డే సందర్భంగా గాయపడిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు  దూరమయ్యాడు. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీమ్ లోకి తీసుకున్నారు. బిష్ణోయ్ ఇప్పటిదాకా 42 టీ20ల్లో 61 వికెట్లు తీశాడు. అతడు 2025 ఫిబ్రవరిలో భారత్ తరఫున చివరిసారిగా టీ 20 ఫార్మాట్లో ఆడాడు. తిలక్ వర్మ చివరి రెండు మ్యాచ్ లకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకునేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు  వెళ్లనున్నాడు. న్యూజిలాండ్ తో  టీ20 సిరీస్ 21న మొదలవనుంది.