భారత్ లో మరో చెస్ గ్రాండ్ మాస్టర్..ఆర్యన్ 

Spread the love

భారత్ లో చెస్ కు ఆదరణ పెరగడమే కాకుండా యువతరం ఆటగాళ్లు ఎందరో కీలకంగా రాణిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా భారత్ నుంచి మరో గ్రాండ్ మాస్టర్ అవతరించాడు. ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల ఆర్యన్ వర్ష్న  గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న  భారత 92వ ఆటగాడిగా నిలిచాడు. అర్మేనియాలో అండ్రానిక్ మార్గరియాన్ టైటిల్ ను కైవసం చేసుకోవడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. టోర్నీలో 8వ రౌండ్లో అంబర్ట్సు మియన్ తో  గేమ్ను డ్రా చేసుకోవడంతో గ్రాండ్మాస్టర్ కు  అవసరమైన మూడో నార్మ్ ను  అతడు సాధించాడు.