ఎనర్జీని దిగుమతి చేసుకునే దేశం నుండి స్వచ్ఛమైన ఇంధనాన్ని (Clean Energy) ఎగుమతి చేసే దేశంగా ఎదగడం – ఇది భారతదేశం తీసుకోబోతున్న తదుపరి భారీ అడుగు అని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, 2024’ ఈ దార్శనికతకు పునాది వేసిందిని లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఏఎం గ్రీన్ గ్రూప్ (AM Green Group) చేపట్టిన ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి ప్రాజెక్టు, మొత్తం ఎనర్జీ వాల్యూ చైన్ (Energy Value Chain) అంతటా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కూడుకున్నదని తెలిపారు. నేడు సౌదీ అరేబియా చమురు రంగంలో ఏ విధంగా ఉందో, రేపు క్లీన్ ఎనర్జీ ఎగుమతుల్లో భారతదేశాన్ని అదే స్థాయి స్థానంలో నిలబెట్టడానికి ఇదొక కీలక అడుగని పేర్కొన్న లోకేష్ అది ఎలా పని చేస్తుందో వివరించే వీడియోను కూడా పంచుకున్నారు.