ఈ సంవత్సరం రిపబ్లిక్ వేడుకలను టార్గెట్ గా చేసుకుని ఉగ్రమూకలు దేశ రాజధాని ఢిల్లీలో దాడులకు ప్లాన్ లు వేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్, ఖలిస్తానీ కేంద్రంగా ఉన్న ఉగ్రసంస్థలు రిపబ్లిక్ డే రోజున ఢిల్లీ సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో కుట్రలకు పాల్పడే ప్రయత్నం చేయవచ్చని తెలిపాయి. దేశ ఇంటర్నల్ సెక్యూరిటీకి భంగం కలిగించేందుకు ఖలిస్తానీ, ఇతర ర్యాడికల్ హ్యాండ్లర్లు లోకల్ గ్యాంగ్స్టర్లను ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లలో ఉగ్రనెట్వర్క్ విస్తరిస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపాయి. ఇక గతేడాది ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీతో పాటుగా ఇతర ప్రముఖ నగరాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశాయి.