తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఇందుకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు.
మున్సిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్ల వివరాలు
| కార్పొరేషన్ పేరు | రిజర్వేషన్ వర్గం |
| జీహెచ్ఎంసీ (GHMC) | మహిళా (జనరల్) |
| కొత్తగూడెం కార్పొరేషన్ | ఎస్టీ (జనరల్) |
| రామగుండం కార్పొరేషన్ | ఎస్సీ (జనరల్) |
| మహబూబ్ నగర్ కార్పొరేషన్ | బీసీ (మహిళా) |
| మంచిర్యాల కార్పొరేషన్ | బీసీ (జనరల్) |
| కరీంనగర్ కార్పొరేషన్ | బీసీ (జనరల్) |
| గ్రేటర్ వరంగల్ (GWMC) | జనరల్ |
| ఖమ్మం కార్పొరేషన్ | మహిళా (జనరల్) |
| నల్గొండ కార్పొరేషన్ | మహిళా (జనరల్) |
| నిజామాబాద్ కార్పొరేషన్ | మహిళా (జనరల్) |