దేశ విభజన గురించి నేటి తరానికి తెలియాలి:సుధామూర్తి 

Spread the love

దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు, దేశ చరిత్ర వంటి వాటిని ఈతరం పిల్లలు తప్పకుండా తెలుసుకోవాలని రాజ్యసభ సభ్యురాలు, రచయిత్రి సుధా మూర్తి అన్నారు. జైపూర్ వేదికగా జరుగుతున్న సాహిత్య వేడుకలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ విభజనపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దేశ విభజన జరగడం తప్పని భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. చరిత్ర తెలియకపోతే భవిష్యత్తును అర్ధం చేసుకోలేమని దేశ విభజన నాటి పరిస్థితులు గుర్తుకు వస్తే అప్పటి పరిణామాల గురించి ఈ తరానికి తెలియజేయాలని చాలా సార్లు అనుకున్నట్లు తెలిపారు. మన భాషలు, సంస్కృతులు గురించి తెలియని వ్యక్తి మన దేశాల సరిహద్దులు ఇవి అని నిర్ణయించారని అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ని ఉద్దేశించి అన్నారు. అప్పటి పరిస్థితులలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ లకు వలస వెళ్లిన వారి గురించి ఆలోచిస్తే బాధ కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మరో విషయాన్నీ ఆమె గుర్తుచేసుకున్నారు. ఒకసారి పాకిస్థాన్ లోని మ్యూజియంకు వెళితే విదేశీయురాలని ఎక్కువ చార్జీ తీసుకున్నారని అయితే అది కూడా ఒకప్పుడు మన భారత్ లోని భాగమే ఇప్పుడు సరిహద్దుల పరంగా అది పొరుగుదేశమైందనే  కదా ఇది ఆలోచిస్తే బాధ కలిగిందని వ్యాఖ్యానించారు. ఎందరో ఈ దేశం కోసం తమ సర్వస్వాలను ధారపోసారని అటువంటి వారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. దేశ విభజన కోసం అప్పుడు తీసుకున్న నిర్ణయం ఎన్నో తరలపై ప్రభావం చూపిందన్నారు. ఇటువంటి విషయాలు ఈ తరానికి తెలిపేందుకు ‘ది మ్యాజిక్  ఆఫ్ ది లాస్ ఇయర్ రింగ్స్’ అనే పుస్తకం రచించినట్లు తెలిపారు.