దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని మొదటి సారి గెలుచుకుని విదర్భ సత్తాచాటింది. తాజాగా జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అథర్వ తైదె (128; 118 బాల్స్ లో 15×4, 3×6) సెంచరీతో అదరగొట్టాడు. అతడికి తోడు యశ్ రాథోడ్ (54), అమన్ మోఖడే (33) కూడా ఆకట్టుకున్నారు. అథర్వ, రాఠోడ్ జోడీ రెండో వికెట్ కు 133 పరుగులు జోడించింది. అంకుర్ పన్వం నాలుగు వికెట్లతో రాణించాడు. చిరాగ్ జాని, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు తీశారు. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (88), చిరాగ్ (64) పోరాడారు. యశ్ ఠాకూర్ 4వికెట్లు, నచికేత్ భూటె 3 వికెట్లు పడగొట్టారు.