ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీసత్తా చాటిన ప్లేయర్స్ 

Spread the love

ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో కొరియాకు చెందినవి ఆన్ సియంగ్,చైనీస్ తైపీకి చెందిన  లిన్ చున్ యి విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సియంగ్ టైటిల్ నిలుపుకున్నారు.  పురుషుల విభాగంలో లిన్ చున్ తొలిసారిగా ఛాంపియన్ గా నిలిచాడు.తాజాగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సియంగ్ 21-13, 21-11తో రెండో సీడ్ చైనాకు చెందిన యింగ్ జి యి పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో లీన్ చున్ 21-10, 21-18తో మూడో సీడ్ ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టీ పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్ లోచైనా జోడీ  లియాంగ్ వీ కెంగ్- వాంగ్ చాంగ్ టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఈ డబుల్స్ జోడీ 17-21, 25-23, 21-16తో జపాన్ కు చెందిన హిరోకి మిదరోకివా- కొహెయ్ యమషిత పై గెలుపొందింది. మహిళల డబుల్స్ ఫైనల్లో చైనా కు చెందిన  షెంగ్ షు- టాన్ నింగ్ 21-11, 21-18తో జపాన్ కు చెందిన పుకుషిమ- మత్సుమోటో పై గెలిచి టైటిల్ను గెలుచుకుంది. థాయిలాండ్ మిక్స్డ్ డబుల్స్ దెచపోల్- సుపిసర ద్వయం విన్నర్ గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఈ జంట 19-21, 25-23, 21-18తో డెన్మార్క్ జోడీ  మథియాస్ క్రిస్టియాన్సెన్-అలెగ్జాండ్రా బోయె పై నెగ్గింది.