పవన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి.. అందుకే ఆంధ్రాలో షూటింగ్ 

Spread the love

‘అనగనగా ఒక రాజు’ సినిమా షూటింగ్ లో ఎక్కువ భాగం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే జరిగిన విషయాన్ని నటుడు నవీన్ పొలిశెట్టి తెలిపారు. మూవీ టీమ్  నిన్న రాజమహేంద్రవరంలో సక్సెస్ సంబరాలతో అలరించింది. నగరంలోని అప్సర థియేటర్‌లో ‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రదర్శితమవుతుండగా నటుడు నవీన్ పొలిశెట్టి, నటి మీనాక్షి చౌదరి ప్రేక్షకుల మధ్యకు వచ్చి తమ ఆనందాన్ని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ఏపీలో కూడా సినిమా షూటింగ్ లు  జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తన హృదయాన్ని తాకాయని అన్నారు. అందువల్లే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధిక భాగం షూటింగ్ జరపాలని నిర్ణయించుకుని పూర్తి చేశామని తెలిపారు. షూటింగ్ ఎక్కడ చేసినా అధికారులు సులువుగా అనుమతులు ఇచ్చారని, పూర్తి సహకారం అందించారని ఆయన ఈ సందర్భంగా  కొనియాడారు. లోకల్  ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించారని తెలిపారు. సినిమా విజయవంతం కావడం పట్ల నటి మీనాక్షి చౌదరి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.