వినరా ఓ పాప్ కార్న్ కథ…!

Spread the love

పాప్ కార్న్… అబ్బా ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరతాయి కదు… ఏ సంతోషమొచ్చిన పాప్ కార్న్, సినిమా చూసిన పాప్ కార్న్, బోర్ కొట్టిన పాప్ కార్న్, ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ని బుజ్జగించాలన్న పాప్ కార్న్… అందుకే అన్నాం కార్న్ ‘పాప్ కథ’ వినరా అని… ఇక ఈరోజు నేషనల్ పాప్ కార్న్ డే కాబట్టి ఈ ఇష్టమైన స్నాక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం…

కానీ మనకేం తెలుసు పాప్ కార్న్ మీద కూడా GST వేస్తారని… వినడానికే షాక్ గా ఉంటే, GST కట్టి మరీ తినాలి పాప్ కార్న్… అదే చేస్తున్నాం కదా మనం థియేటర్స్ లో! అసలు పాప్ కార్న్ తింటూ సినిమా చుస్తే ఆ కిక్ ఏ వేరబ్బా…

అసలు పాప్ కార్న్ ఎక్కడ పుట్టి ఎలా ఇండియా కి వచ్చి, ఎలా మన ఇంట్లోకి వచ్చిందో చుద్దామా… ఆ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియో చూసేయండి…

మొక్కజొన్న సుమారు 10,000 సంవత్సరాల క్రితం మెక్సికోలో పెంపకం అని చెరిత్ర చెప్తుంది. పెరూ నుండి వచ్చిన మొక్కజొన్న 4700 BCE నాటికే అక్కడ ఉండేదని ఇంకా 1000 సంవత్సరాల క్రితం అక్కడ కనిపించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1948 ఇంకా 1950లో, 3600 BCE నాటికే, మొక్కజొన్నకు సంబంధించిన ఆధారాలను హార్వర్డ్ ఆంత్రోపాలజీ గ్రాడ్యుయేట్ విద్యార్థి హెర్బర్ట్ W. డిక్ ఇంకా హార్వర్డ్ బోటనీ గ్రాడ్యుయేట్ విద్యార్థి క్లాడ్ ఎర్లే స్మిత్, జూనియర్ కనుగొన్నారు. 

పాప్డ్ కార్న్ అనే పదం మొదట జాన్ రస్సెల్ బార్ట్‌లెట్ యొక్క 1848 డిక్షనరీ ఆఫ్ అమెరికనిజంలో కనిపించింది. 

అలా 1900 శతబ్దం నాటికి వచ్చేసరికి అది ఫస్ట్ బ్రాండెడ్ పాప్ కార్న్ లా మారి ఓన్లీ షాప్స్ లో మాత్రమే దొరికేది… అలా సినిమా లు స్టార్ట్ అయ్యాక పాప్ కార్న్ కథ మారిపోయింది! సినిమా చూడాలంటే పాప్ కార్న్ ఉండాల్సిందే చాలా మందికి…

అసలు విలన్ హీరోని కొడుతుంటే పాప్ కార్న్ ని గట్టిగా నములుతూ, అయ్యో మా హీరో ని ఇలా కొడుతున్నాడేంటి అనుకుంటాం… మరి హీరో విలన్ ని కొడుతుంటే, కొట్టు రా కొట్టు అని ఆనందంగా నములుతాం… ఇక హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్ ఐతే, తింటాం ఆస్వాదిస్తాం. కామెడీ సీన్స్ ఐతే, ఎన్ని సార్లు నవ్వి నవ్వి పాప్ కార్న్ కింద పడేయలేదు… అలా టికెట్ రేట్లు 10 రూపాయలు ఉన్నపుడు పాప్ కార్న్ రూపాయికి దొరికేది. అలా చిన్న పిల్లలు ఐతే, పాప్ కార్న్ ప్యాకెట్ ఇస్తే ఎంత సంతోషమో… బర్త్ డే పార్టీ ఐనా పాప్ కార్న్, మంచి మార్కులు వచ్చినా పాప్ కార్న్ ఏ మరి…

ఇక పాప్ కార్న్ ఎలా చేసుకోవాలో మేము చేపకర్లేదు అనుకుంటా… మొదట్లో షాప్స్ లో కొనుకునే వాళ్ళం… తరువాత,సైకిల్స్ మీద కూడా అమ్మరు…ఇక నెక్స్ట్ ‘ACT’ కంపెనీ వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ లో మొక్కజొన్న గింజలను oil కూడా కలిపి కేవలం pan లో వేస్తే చాలు, గుప్పు గుప్పులగా పాప్ కార్న్ లు వచ్చి పడేవి…

తరువత మన లేటెస్ట్ GEN Z జనరేషన్ కి వచ్చేసరికి, Oven లో పెట్టుకునే ప్యాకెట్లు వచ్చేసాయి… అలా ఎక్కడ మొక్క జొన్న గింజలు, ఎక్కడ పాప్ కార్న్… మళ్లీ  దానికి flavours… ఒకటా రెండా… చాక్లోట్, మసాలా, ఉప్పు, ఇలా ఎన్ని రకాలో!

ఇప్పుడు ఈ పాప్ కార్న్ కథ అంతా ఏంటి అనుకుంటే, చెప్తాం ఆగండి! అసలు పాప్ కార్న్ ధర మొదటిలో 10 రూపాయలు ఉండేది… తరువాత 50 అన్నారు… పోనీలే అని కొన్నాం… మల్టీప్లెక్స్ కి వచ్చేసరికి ఆ ధర కాస్తా 100 200 300 ఇలా ప్యాకెట్ సైజు బట్టి మారుతుంటుంది… మధ్యతరగతి వాళ్ళకి మల్టీప్లెక్స్‌లో పాప్ కార్న్ తినాలి అంటే, జోబుకు చిల్లు పడినట్టే కదా…

సరేలే ఎలాగో అలా కొంటున్నం అనుకుంటే GST పిడుగు మన నెత్తిన పడింది… ఇంకే వస్తువు దొరకలేదా GST వేయడానికి అని అనుకునే వాళ్ళు చాలా మంది కదా…

అలా అసలు పాప్ కార్న్ కి ఎంత GST ఛార్జ్ చేస్తారో తెలుసా:

• నాన్-బ్రాండెడ్ & ప్యాక్ చేయని పాప్‌కార్న్ ఉప్పు మరియు spices – 5% GST

• బ్రాండెడ్ & ప్రీ-ప్యాకేజ్డ్ పాప్‌కార్న్‌తో ఉప్పు మరియు spices – 12% GST

• Caramel ఫ్లేవర్ పాప్‌కార్న్ అన్‌ప్యాక్డ్ & ప్రీ-ప్యాకేజ్డ్ రెండూ – 18% GST

ఇదండీ మన పాప్ కార్న్ కథ…