విలక్షణ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ ను పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు.సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటించనున్నట్లు తెలిపారు. లైట్బాక్స్ మీడియా, స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈచిత్రానికి GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఇక విడుదలైన గ్లిమ్ప్స్ ఫ్రెష్ ఫీల్ తో అలరిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఒక మంచి కథాంశంతో తెరకెక్కుతున్నట్లు ఈ గ్లిమ్ప్స్ చూస్తుంటే తెలుస్తోంది.