తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం అనేది దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడా లేదని అన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి లబ్దిదారుడు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డని ఫైర్ అయ్యారు. టెండర్లు ఆన్‌లైన్‌లో వేయకుండా కాంట్రాక్టర్లు సైట్‌కు వెళ్లి చూసి సింగరేణి నుండి ఈ సర్టిఫికెట్ పొందాలన్నారు. తద్వారా టెండర్లు ఎవరు వేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి ముందే తెలుసుకున్నాడు.. తర్వాత వారిని భయబ్రాంతులకు గురిచేసి టెండర్లు రద్దు చేసుకోవాలని బెదిరించి, టెండర్లను తన అనునాయులకు కట్టబెడుతున్నాడని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే.. వారి గద్దె కూలడం ఖాయమని హెచ్చరించారు.తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని అనవసర మాటలు కట్టి పెట్టి.. ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.