“దండోరా” చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసలు

Spread the love

శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ మరియు బిందు మాధవిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండోరా’. ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రానికి తెలుగు అగ్రనటుడు జూ.ఎన్టీఆర్ ప్రశంసలు కూడా దక్కాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.  

ఇప్పుడే “దండోరా” సినిమా చూశాను. ఎంతో ఆలోచింపజేసే విధంగా, చాలా శక్తివంతంగా ఉంది. శివాజీ గారు, నవదీప్, నందు, రవి కృష్ణ మరియు బిందు మాధవి తమ అద్భుతమైన నటనతో సినిమా అంతటా ఆకట్టుకున్నారు. ఇంతటి బలమైన రచనతో, మన మట్టి కథను (rooted story) చాలా చక్కగా తెరకెక్కించిన దర్శకుడు మురళి కాంత్ గారికి హ్యాట్సాఫ్. ఇలాంటి ప్రయత్నాన్ని ప్రోత్సహించి అండగా నిలిచిన రవీంద్ర బెనర్జీ గారికి అభినందనలు. ఇంతటి విశేషమైన చిత్రంలో భాగస్వాములైన నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ ఎన్టీఆర్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.