తెలుగులో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్న నటీమణులు త్రిష కృష్ణన్, నయనతార. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు లేటెస్ట్ గా తమ ఫాన్స్ కి నిజమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. వారి హాలిడేకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దుబాయ్‌లో విహారయాత్ర చేస్తూ, సన్ సెట్ ని ఆస్వాదిస్తున్న ఈ ఇద్దరూ ఒక యాచ్‌పై కలిసి కూర్చుని కనిపించారు. బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో ట్విన్నింగ్ అవుతూ, తమ ఫన్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధించారు. సౌతిండియన్ సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణం చేసిన టాప్ స్టార్స్ అయిన నయనతార–త్రిష… తమిళంలో కలిసి కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఇలా పబ్లిక్‌గా కలిసి కనిపించడం చాలా అరుదు. అందుకే ఈ ఫోటోలు బయటకు రాగానే అభిమానులు వైరల్ చేస్తున్నారు. లక్షల్లో కాదు… మిలియన్ల లైక్స్, వ్యూస్‌తో ఇంటర్నెట్ మొత్తం హడావిడి మొదలైంది. నెటిజన్లు ఈ ఇద్దరు క్వీన్స్‌తో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెట్టారు. “ఇది అసలు ఊహించని కలయిక”, “ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే థియేటర్లు తగలబడిపోతాయి” అంటూ అభిప్రాయాలు వెల్లువెత్తాయి. కొందరైతే ఈ ఫోటో నిజమేనా అని రెండుసార్లు, మూడుసార్లు చూసి… “ఇది ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజ్ కాదుకదా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
నయనతార ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో కనిపించి సంక్రాంతి ప్రేక్షకులను అలరించింది. తమిళంలో ఆమె చివరి చిత్రం ‘టెస్ట్’, ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. నెక్స్ట్ ఆమె లైనప్ చూస్తే నిజంగా షాక్ తినాల్సిందే. డియర్ స్టూడెంట్స్, NBK 111, Toxic: A Fairy Tale for Grown-Ups, మన్నంగట్టి సిన్స్ 1960, పేట్రియట్, మూకుతి అమ్మన్ 2, హై, రక్కాయి… ఇలా భాషలు, జానర్లు దాటుతూ వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఇక త్రిష విషయానికి వస్తే… గత ఏడాది విడుదలైన కమల్ హాసన్–మణిరత్నం కలయికలో వచ్చిన ‘థగ్ లైఫ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఆమె సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరుప్పు’ విడుదల కోసం ఎదురుచూస్తోంది. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ లో కూడా త్రిష కీలక పాత్ర పోషిస్తోంది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.మొత్తానికి… దుబాయ్ ట్రిప్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసిన నయనతార–త్రిష, నిజంగా “క్వీన్స్ టుగెదర్” అనిపించేశారు.