రంజీ ట్రోఫీ బరిలోకి శుభ్ మాన్ గిల్ 

Spread the love

భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్ మాన్ గిల్ నేటి నుంచి రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ముగియడంతో గిల్ దేశవాళీ బాటపట్టాడు. గురువారం సౌరాష్ట్రతో ప్రారంభం కానున్న మ్యాచ్ లో పంజాబ్ తరపున గిల్ ఆడనున్నాడు. ప్రస్తుతం పంజాబ్ గ్రూప్ బి లో 11 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఆ జట్టు నాకౌట్ చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలవాలి. గిల్ రాక ఆ జట్టుకు అదనపు బలం కానుంది. మెడ గాయం నుంచి కోలుకున్న తరువాత రెడ్ బాల్ ఫార్మాట్ ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్ ఫిట్ గా మరియు ఫామ్ లో ఉండడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.